విరాట్‌ను వదలని ఆస్ట్రేలియా మీడియా | Virat Kohli Grouped Along With Animals in 'Villain of the Week' Poll | Sakshi
Sakshi News home page

విరాట్‌ను వదలని ఆస్ట్రేలియా మీడియా

Mar 12 2017 7:56 PM | Updated on Sep 5 2017 5:54 AM

విరాట్‌ను వదలని ఆస్ట్రేలియా మీడియా

విరాట్‌ను వదలని ఆస్ట్రేలియా మీడియా

ఫాక్స్‌ స్పోర్ట్స్‌ ఆస్ట్రేలియా ఫెస్‌బుక్‌ ఖాతాలో కోహ్లి ఫోటోతో ‘వెటెల్‌ ఆఫ్‌ ది వీక్‌’ అని పోస్ట్‌ చేసి మరో వివాదానికి తెరలేపింది.

న్యూఢిల్లీ: ఆటపై దృష్టి పెడదామంటూ బీసీసీఐ, క్రికెట్‌ ఆస్ట్రేలియా డీఆర్‌ఎస్‌ వివాదాన్ని పక్కన పెట్టినా, ఆస్ట్రేలియా మీడియా మాత్రం తమ బుద్ది పోనించుకోవడం లేదు. ఇప్పటికే ది టెలిగ్రాఫ్‌ పత్రిక భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ అనిల్‌ కుంబ్లేలపై సంచలన ఆరోపణలతో తమ అక్కసు వెళ్లగక్కింది . తాజాగా ఫాక్స్‌ స్పోర్ట్స్‌ ఆస్ట్రేలియా తమ ఫెస్‌బుక్‌ ఖాతాలో కోహ్లిని జంతువులతో పోలుస్తు ఒక ఫోటోని  పోస్ట్‌ చేసి మరో వివాదానికి తెరలేపింది.
 
కోహ్లి , పిల్లి, కుక్కపిల్ల, పాండా జంతువుల ఫోటోతో వెటెల్‌ ఆఫ్‌ ది వీక్‌ అని పోస్ట్‌ చేసింది. దీనికి క్యాప్షన్‌గా ‘ ఇటీవల జరిగిన పరిణామాలు మన వెటెల్‌ ఆఫ్ ది వీక్‌ అవార్డుకు ప్రేరేపించే విధంగా ఉన్నాయి. పిల్లలు మీ తాతయ్యలను అడగండి. మిగిలిన విషయాలు మీకు తెలుసు అని’ రాసింది. దీనిపై భారత్‌ ఎలా స్సందిస్తుందో చూడాలి. ఇప్పటికే బీసీసీఐ ఆటపై దృష్టి మరల్చకుండా ఉండేందుకు ఐసీసీకి చేసిన ఫిర్యాదు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఒక వైపే వివాదాన్ని పక్కన పెట్టినా మరో వైపు రెచ్చగొట్టే చర్యలు పాల్పడుతుండటంతో ఇరు జట్ల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం కోల్పోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement