అగ్రస్థానంలో విజయ్‌ కుమార్‌ | Vijay Kumar Leads In Sailing Championship | Sakshi
Sakshi News home page

అగ్రస్థానంలో విజయ్‌ కుమార్‌

Jul 26 2019 9:57 AM | Updated on Jul 26 2019 9:57 AM

Vijay Kumar Leads In Sailing Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాన్‌సూన్‌ రెగెట్టా ఫ్లీట్‌ రేసింగ్‌లో తృష్ణ సెయిలింగ్‌ క్లబ్‌ బెంగళూరు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. హుస్సేన్‌సాగర్‌లో జరుగుతోన్న ఈ టీమ్‌ ఈవెంట్‌లో గురువారం నాటికి 30 రేసులు ముగియగా తృష్ణ క్లబ్‌కు చెందిన విజయ్‌ కుమార్‌ (7) అగ్రస్థానంలో నిలిచాడు. గురువారం జరిగిన ఎనిమిది రేసుల్లో తృష్ణ క్లబ్‌ ఏడు రేసుల్లో విజేతగా నిలిచింది. ఎన్‌ఎస్‌ఎస్‌ భోపాల్‌కు ప్రాతినిధ్యం వహించిన ఉమా చౌహాన్‌ (5), ఏకలవ్య  (5) చెరో ఐదు రేసుల్లో గెలుపొంది వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌ తరఫున పోటీల్లో పాల్గొన్న ప్రీతి కొంగర 4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవగా... విశ్వనాథ్‌ (4 పాయింట్లు) ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement