చిందులేశారు! ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు! | This epic West Indies team celebration video is a must watch | Sakshi
Sakshi News home page

చిందులేశారు! ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు!

Apr 1 2016 6:00 PM | Updated on Aug 14 2018 3:47 PM

ధోనీసేనను ఓడించి.. టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌లోకి ఎంటరైన విండీస్‌ ఆటగాళ్లు మస్త్‌ మజా చేశారు.

ధోనీసేనను ఓడించి.. టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌లోకి ఎంటరైన విండీస్‌ ఆటగాళ్లు ఫుల్‌గా మజా చేశారు. ఆడారు. పాడారు. చిందులు వేశారు. సెమీఫైనల్‌లో 193 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన వెస్టిండీస్‌ ఆటగాళ్ల ఆనందానికి అడ్డులేకుండా పోయింది. ఇటు మైదానంలో, అటు డ్రెస్సింగ్‌లో రూమ్‌లో ఆటగాళ్లు సందడే సందడి చేశారు. క్యాలిప్సో స్టెప్పులతో అదరగొట్టారు. షర్ట్ లేకుండానే క్రిస్ గేల్, డ్వేయిన్ బ్రావోలు డీజే డాన్స్ తో దుమ్మురేపారు. డీజేగా బ్రావో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇండియాపై గెలుపుతో ఆ టాలెంట్‌ను అతను బయటపెట్టాడు. వాంఖడే స్టేడియంలో డీజే ట్రాక్స్ వినిపించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement