న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు ఎదురీదుతోంది.
కివీస్ తొలి ఇన్నింగ్స్ 431
డ్యునెడిన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు ఎదురీదుతోంది. చండిమాల్ (208 బంతుల్లో 83 బ్యాటింగ్; 9 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో పోరాడుతుండగా ఓపెనర్ కరుణరత్నే (198 బంతుల్లో 84; 7 ఫోర్లు) రాణించడంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో నాలుగు వికెట్లకు 197 పరుగులు చేసింది. కివీస్ స్కోరుకు ఇంకా 234 పరుగులు వెనుకబడి ఉంది. 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన లంకను చండిమాల్, కరుణరత్నే జోడి ఆదుకుని మూడో వికెట్‌కు 122 పరుగులు జోడించింది. క్రీజులో వితంగే (10 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు 409/8 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ 96.1 ఓవర్లలో 431 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రదీప్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.
వాగ్నర్ ‘రికార్డు’ వేగం..
లంక ఇన్నింగ్స్‌లో చండిమాల్‌కు పేసర్ వాగ్నర్ వేసిన ఓ బంతి స్పీడ్‌గన్‌పై 160కి.మీ వేగం చూపించడం కలకలం రేపింది. ఎందుక ంటే అంతకుముందు ఈ బౌలర్ ఈ వేగానికి దరిదాపుల్లో కూడా బంతి వేసింది లేదు. అయితే అధికారులు మాత్రం తక్కువ ఎత్తులో ఎగిరిన పక్షి ఈ వేగానికి కారణం అయ్యుండవచ్చని అనుమానించారు.