హోం ఐసోలేషన్‌కు గంగూలీ

సోదరుడు స్నేహాశీష్‌కు కరోనా పాజిటివ్
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి, గంగూలీకి సోదరుడైన స్నేహాశీష్ గంగూలీ బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో దాదా కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్నాడు. బెంగాల్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన స్నేహాశీష్ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు ‘క్యాబ్’ అధికారి ఒకరు తెలిపారు. అతనికి పాజిటివ్ రావడంతో నిబంధనల ప్రకారం గంగూలీ కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉండనున్నాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి