న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైనా...ఆరుగురు క్రికెటర్లు తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాల్సిందని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైనా...ఆరుగురు క్రికెటర్లు తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాల్సిందని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.
బుధవారం నుంచి ప్రారంభం కానున్న రంజీ క్వార్టర్స్‌లో ఆడితే ఆటగాళ్లకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఆయా మ్యాచ్‌ల విలువ కూడా పెరిగేదని ద్రవిడ్ అన్నారు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు బయల్దేరాల్సి ఉన్నందున రోహిత్, రహానే, బిన్నీ, భువనేశ్వర్, షమీ, రైనా రంజీ క్వార్టర్స్‌కు దూరంగా ఉన్నారు. వారికి అవకాశం ఇవ్వాలని యూపీ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ తిరస్కరించింది కూడా. తొలి వన్డేకు ముందు ఏడు రోజుల వ్యవధి ఉందని, గతంలో ఇలాంటి సందర్భాల్లో క్రికెటర్లు మ్యాచ్‌లు ఆడారని ద్రవిడ్ గుర్తు చేశారు.