
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో నేరుగా పాల్గొనేందుకు వచ్చిన అవకాశాన్ని హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ షేక్ హుమేరా సద్వినియోగం చేసుకోలేకపోయింది. పారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు టోర్నీలో హుమేరాకు నిరాశ ఎదురైంది. ముగ్గురు క్రీడాకారిణుల మధ్య జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన వారికి మెయిన్ ‘డ్రా’లో స్థానం లభిస్తుంది.
అయితే హుమేరా ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో పరాజయం పాలవ్వడంతో మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో షేక్ హుమేరా 6–3, 7–5తో కామిల్లా బొస్సి (బ్రెజిల్)పై గెలిచింది. అయితే ఫంగ్రాన్ తియాన్ (చైనా)తో జరిగిన రెండో మ్యాచ్‌లో హుమేరా 1–6, 3–2తో ఓడిపోయింది.