
'ధోని కోసం నా దుస్తులు అమ్ముతా'
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలానికి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వస్తే ఎలాగైనా దక్కించుకుంటానని అంటున్నాడు బాలీవుడ్ బాద్ షా, కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుక్ ఖాన్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలానికి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వస్తే ఎలాగైనా దక్కించుకుంటానని అంటున్నాడు బాలీవుడ్ బాద్ షా, కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుక్ ఖాన్. ధోని లాంటి కీలక ఆటగాడు ముందు వేలానికి వస్తే ఎటువంటి ఆలోచనా లేకుండా తన జట్టులోకి తీసుకుంటానన్నాడు. చివరకు తన దుస్తులు అమ్మయినా సరే ధోనిని వేలం పాటలో దక్కించుకుంటానంటూ అతనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు షారుక్.
'ధోనిని ముందు ఐపీఎల్ వేలం పాటలోకి రానివ్వండి. అతన్ని సొంతం చేసుకోవడం కోసం నా పైజామాలు అమ్మేస్తా. ధోనిని కోల్ కతా నైట్ రైడర్స్ జెర్సీలో చూడాలనుకుంటున్నా. ఒకవేళ వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలోకి ధోని వస్తే మాత్రం అతన్ని ఎలాగైనా దక్కించుకుంటా'అని షారుక్ పేర్కొన్నాడు.