'దశాబ్దానికి సరిపడా క్రికెట్ జట్టు ఇది' | See this batch representing India for next 10 years, says sachin Tendulkar | Sakshi
Sakshi News home page

'దశాబ్దానికి సరిపడా క్రికెట్ జట్టు ఇది'

Sep 22 2016 1:02 PM | Updated on Sep 4 2017 2:32 PM

'దశాబ్దానికి సరిపడా క్రికెట్ జట్టు ఇది'

'దశాబ్దానికి సరిపడా క్రికెట్ జట్టు ఇది'

ప్రస్తుత భారత టెస్టు క్రికెట్ జట్టుపై మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ప్రశంసలు వర్షం కురిపించాడు.

కాన్పూర్: ప్రస్తుత భారత టెస్టు క్రికెట్ జట్టుపై మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ప్రశంసలు వర్షం కురిపించాడు. రాబోవు దశాబ్దాకాలంలో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు  ప్రపంచ క్రికెట్ ను శాసిస్తుందనడంలో  ఎటువంటి సందేహం లేదని సచిన్ కొనియాడాడు.

 

'మన ప్రస్తుత క్రికెట్ జట్టు అద్భుతంగా ఉంది. ఇప్పుడు టెస్టు క్రికెట్ ఆడుతున్న వారిలో దాదాపు యువ క్రికెటర్లే. వీరంతా ఫిట్ గా ఉంటే 8 నుంచి 10 సంవత్సరాలు ఈ జట్టునే చూస్తాం.  విశేషమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు మన సొంతం. దాంతో పాటు జట్టులో సమతుల్యం అమోఘం' అని సచిన్ ప్రశంసించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement