చెమటోడ్చి నెగ్గిన సైనా | saina enterd into malasia open serice semi finals | Sakshi
Sakshi News home page

చెమటోడ్చి నెగ్గిన సైనా

Apr 3 2015 4:00 PM | Updated on Sep 2 2017 11:48 PM

చెమటోడ్చి నెగ్గిన సైనా

చెమటోడ్చి నెగ్గిన సైనా

వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ సైనా నెహ్వాల్ దూకుడు కొనసాగుతోంది. మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నలో చైనా క్రీడాకారిణి సన్ యూను ఓడించిన హైదరాబాదీ షెట్లర్.. సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది.

వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ సైనా నెహ్వాల్ విజయపరంపర  కొనసాగుతోంది. మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా క్రీడాకారిణి, అన్ సీడెడ్ సన్ యూను అతి కష్టం మీద ఓడించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగే సెమీస్ లో చైనా క్రీడాకారిణి, పదో ర్యాంకర్ లీ జిన్ తో తలపడనుంది. 

 

శుక్రవారం కౌలాలంపూర్లో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ లో  తొలి రౌండ్లో పూర్తి ఆధిక్యతను ప్రదర్శించిన హైదరాబాదీ షెట్లర్.. రెండో రౌండ్ ప్రారంభంలోనే తడబాటుకు గురైంది. మధ్యలో కొన్ని వరుస పాయింట్లు సాధించిప్పటికీ 15 వ సీడ్ సన్ యూను నిలువరించలేకపోయింది. దీంతో 18-21 తేడాతో రెండో సెట్ కోల్పోవావసి వచ్చింది. ఇక మూడో రౌండ్లో ఇండియా- చైనాల మధ్య భీకర పోరు జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మూడో రౌండ్లో 21- 17తో హైదరాబాదీ ప్లేయర్ ముందంజవేసింది. ఈ విజయంతో సైనా.. మలేసియా సూపర్ సిరీస్ సెమీస్ లోకి ప్రవేశించింది. ఇటీవలే ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిన్ను కైవసం చేసుకున్న ఆమె..  కెరీర్లో 17 వ టైటిల్ లక్ష్యంగా మరో అడుగు వేసింది.

 

గురువారం వెల్లడయిన బీడబ్ల్యూఎఫ్  ర్యాంకిగ్స్లో 78,541 పాయింట్లతో ఆమె నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది.  ఇండిన్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ నెగ్గి ఊపుమీదున్న తెలుగు తేజం కిడాండి శ్రీకాంత్ సహా కశ్యప్, ప్రణయ్ లు మలేసియా ఓపెన్ సిరీస్ నుంచి ప్రీ క్వార్టర్స్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement