అరుదైన ‘సంపద’ అందరి కోసం... | sachin Tendulkar | Sakshi
Sakshi News home page

అరుదైన ‘సంపద’ అందరి కోసం...

Apr 24 2015 1:07 AM | Updated on Sep 3 2017 12:45 AM

అరుదైన ‘సంపద’ అందరి కోసం...

అరుదైన ‘సంపద’ అందరి కోసం...

సచిన్ టెండూల్కర్ గురించి, అతని రికార్డుల గురించి అలుపెరుగకుండా చెప్పే అభిమానులు అపరిమిత సంఖ్యలో ఉంటే..

 సచిన్ సినిమాలో ప్రదర్శన
 ముంబై: సచిన్ టెండూల్కర్ గురించి, అతని రికార్డుల గురించి అలుపెరుగకుండా చెప్పే అభిమానులు అపరిమిత సంఖ్యలో ఉంటే...అతని అరుదైన చిత్రాలు సేకరించడం, మాస్టర్ వ్యక్తిగత విశేషాలపై ప్రత్యేక ఆసక్తి కనబరిచే ఫ్యాన్స్ సంఖ్య కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అయితే బయటి ప్రపంచానికి తెలియకుండా సచిన్‌కే పరిమితమైన, అతని వద్దే దాచుకున్న అనేక వస్తువులు, వ్యక్తిగత ఆసక్తికి సంబంధించిన ఇతర సేకరణలు కూడా ఇప్పుడు అందరూ చూసే అదృష్టం దక్కనుంది.
 
 
 వీటిని టెండూల్కరే బయటపెట్టనున్నాడు. ఈ దిగ్గజ క్రికెటర్‌పై రూపొం దుతున్న డాక్యుమెంటరీ కమ్ ఫీచర్ ఫిల్మ్‌లో ఇవన్నీ కనిపిస్తాయి. తన కిట్ బ్యాగ్‌లోని చిన్న చిన్న వస్తువులు మొదలు తాను దాచుకున్న విలువైన వస్తువుల వరకు ఇందులో ఉన్నాయి. షూటింగ్ సందర్భంగా దర్శకుడు జేమ్స్ ఎర్‌స్కిన్ ముందు సచిన్ వీటన్నం టినీ ప్రదర్శించాడు. ‘200 నాటౌట్’ అనే సంస్థపై రవి భాగ్‌చంద్కా రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా మైదానంలో కనిపిస్తున్న మాస్టర్ నేడు (శుక్రవారం) తన 42వ పుట్టిన రోజు జరుపుకోనుండటం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement