ఆ క్రెడిట్‌ అంతా అతనిదే: హార్దిక్‌

Rohits knock was special, says Pandya  - Sakshi

బ్రిస్టల్‌: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించడంలో రోహిత్‌ శర్మదే మొత్తం క్రెడిట్‌ అని ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తెలిపాడు. రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో రోహిత్‌ శర్మ ఆడిన తీరు నిజంగా అసాధారణమని పాండ్యా కొనియాడాడు.

‘ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను రోహిత్‌ శర్మ నిలబెట్టాడు. రోహిత్‌ సమయోచితంగా ఆడిన విధానం చాలా బాగుంది. అతని నుంచి ఆశించేది ఈ తరహా ఇన్నింగ్స్‌లే. రోహిత్‌ బంతిని హిట్‌ చేసే పద్ధతిని మాటల్లో వర్ణించలేను. రోహిత్‌లా బంతిని బలంగా హిట్‌ చేసే ఆటగాడ్ని అంతకుముందు నేనెప్పుడూ చూడలేదు’ అని పాండ్యా పేర‍్కొన్నాడు.

మరొకవైపు తన బౌలింగ్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘నిజాయితీగా చెప్పాలంటే టీ20 ఫార్మాట్‌ అనేది చాలా ఫన్నీగా ఉంటుంది. నేను ఒక ఓవర్‌లో 22 పరుగులిచ్చిన తర్వాత నిలకడగా బౌలింగ్‌ చేశా. సరైన ప్రాంతాల్లో బంతులు సంధించి కీలక వికెట్లను సాధించా. బ్రిస్టల్‌ తరహా పిచ్‌ల్లో వికెట్లు సాధిస్తే, పరుగుల్ని నియంత్రించడం సులువు అవుతుంది. అదే ప్లాన్‌తో బౌలింగ్‌ చేసి సక్సెస్‌ అయ్యా. యార్కర్‌ లెంగ్త్‌ బంతులు వేసేటప్పుడు లెంగ్త్‌ అనేది చాలా ముఖ్యం. అన్ని రకాల బంతుల్ని వేయడంతోనే నాకు వికెట్లు లభించాయి. నాకు ప్రతీ గేమ్‌ ఒక పాఠమే’ అని పాండ్యా తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top