
యంగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు ‘బేబి సిట్టర్’గా మంచి పేరుంది. ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన సందర్భంగా పంత్ ఆసీస్ కెప్టెన్ టిమ్ పెయిన్ పిల్లలను ఎత్తుకొని ఆడించి..మంచి ‘బేబి సిట్టర్’గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో పిల్లలను ఆడించడంలో టీమిండియాలో పంత్ తర్వాతే ఎవరైనా అన్నట్టుగా పేరొచ్చింది. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పంత్ మరోసారి ‘బేబి సిట్టర్’ గా మారిపోయాడు. ధావన్ కొడుకు జొరావర్‌ను పంత్ సరదాగా ఆటపట్టించాడు. చిన్నారి జోరావర్‌ను పంత్ టవల్‌లో వేసుకొని గిరిగిరా తిప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పంత్ సరదాగా జోరావర్‌తో ఆడకుంటూ.. ఆటపట్టించడం వరకు బాగానే టవల్‌లో చిన్నారి పిల్లాడిని వేసి.. అలా గిరిగిరా తిప్పడం నెటిజన్లకు కోపం తెప్పించింది. టవల్ జారిపోతే.. పొరపాటున జొరావర్‌కు ఏదైనా జరిగితే.. ఏమిటి పరిస్థితి? కొంచెం కూడా జాగ్రత్త లేకుండా ఏంటా పిల్లచేష్టలు.. పిల్లలతో ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు వద్దు అంటూ పంత్‌కు నెటిజన్లు ఘాటుగా క్లాస్ పీకుతున్నారు. ఇంతకు పంత్ జొరావర్‌ను ఆటపట్టించిన వీడియో చూస్తే మీకెమనిపిస్తోంది. కామెంట్స్‌లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.