ఐపీఎల్‌ సహాయక సిబ్బందిలో తొలి మహిళ | RCB Becomes First IPL Team To Appoint Woman Support Staff | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ సహాయక సిబ్బందిలో తొలి మహిళ

Oct 18 2019 2:41 PM | Updated on Oct 18 2019 3:09 PM

RCB Becomes First IPL Team To Appoint Woman Support Staff - Sakshi

బెంగళూరు: ఐపీఎల్‌ జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తమ సహాయక సిబ్బందిలో ఒక మహిళను తీసుకుంది. టీమ్‌ మసాజ్‌ థెరపిస్ట్‌గా నవనీత గౌతమ్‌ ఎంపికైంది. ఐపీఎల్‌లో ఏ జట్టులోనైనా సహాయక సిబ్బందిలో ఒక మహిళ ఉండటం ఇదే మొదటిసారి.

ఆర్‌సీబీ హెడ్‌ ఫిజియోథెరపిస్ట్‌ ఇవాన్‌ స్పీచ్‌లీ, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ శంకర్‌ బసులతో కలిసి నవనీత పని చేస్తుంది. మసాజ్‌ థెరపీలో ప్రత్యేక శిక్షణ ఉన్న ప్రతిభావంతురాలు నవనీతను తమ జట్టులోకి ఎంచుకోవడం పట్ల గర్వపడుతున్నామని బెంగళూరు చైర్మన్‌ సంజీవ్‌ చురీవాలా వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement