కేకేఆర్‌ విజయలక్ష్యం 140

Rajasthan Set Target of 140 Runs Against KKR - Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 140 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. కెప్టెన్‌ అజింక్యా రహానే(5) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం జోస్‌ బట్లర్‌తో కలిసి స్టీవ్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 72 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత బట్లర్‌(37) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు.

అయితే స్మిత్‌ మాత్రం నిలకడగా ఆడాడు. రాహుల్‌ త్రిపాఠీతో కలిసిన ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే స్మిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. రాజస్తాన్‌ స్కోరు 105 పరుగుల వద్ద త్రిపాఠి(6) ఔట్‌ అయ్యాడు. కాగా, స్మిత్‌(73 నాటౌట్‌; 59 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) చివర వరకూ క్రీజ్‌లో ఉండటంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో గర్నీ రెండు వికెట్లు సాధించగా, ప్రసిద్ద్‌ క్రిష్ణకు వికెట్‌ దక్కింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top