
ప్రాంజల జంటకు డబుల్స్ టైటిల్
అంతర్జాతీయ జూనియర్ టెన్నిస్ సర్క్యూట్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆరెంజ్ బౌల్’ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సంచలనం సృష్టించింది.
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ జూనియర్ టెన్నిస్ సర్క్యూట్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆరెంజ్ బౌల్’ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సంచలనం సృష్టించింది. బాలికల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి తమారా జిదాన్‌సెక్ (స్లొవేనియా)తో కలిసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన డబుల్స్ ఫైనల్లో ప్రాంజల-తమారా ద్వయం 6-2, 6-2తో ఎలెని క్రిస్టోఫి (గ్రీస్)-అనస్తాసియా డెటియుక్ (మాల్దొవా) జంటపై గెలిచింది.
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో 1947 నుంచి జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ తరఫున అండర్-18 విభాగంలో యూకీ బాంబ్రీ (2008లో), అండర్-16 విభాగంలో శ్యామ్ మినోత్రా (1961లో) సింగిల్స్ టైటిల్స్‌ను సాధించారు.