breaking news
Pranjala couple
-
రేవ్ పార్టీలో ప్రాంజల్ ఖేవాల్కర్.. మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం
పూణే: మహారాష్ట్రలోని పూణేలో తాజాగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిలో మహారాష్ట్ర సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అల్లుడు డాక్టర్ ప్రాంజల్ ఖేవాల్కర్ కూడా ఉండటం విశేషం. వీరంతా పార్టీలో కొకైన్, గంజాయి సేవించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటన మరోమారు మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది.డాక్టర్ ప్రాంజల్ ఖేవాల్కర్, ప్రముఖ రాజకీయ నేత ఏక్నాథ్ ఖడ్సే కుమార్తె, జాతీయవాద మహిళా రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సేను వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించే రోహిణి.. ప్రాంజల్‌ను రోండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట ముక్తాయ్‌నగర్‌లో ఉంటోంది. రియల్ ఎస్టేట్, ఈవెంట్ మేనేజ్మెంట్లను నిర్వహిస్తున్న వ్యాపారవేత్తగా ప్రాంజల్ ఖేవాల్కర్ పేరొందారు. చక్కెర, ఇంధన రంగాలకు సంబంధించిన కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఒక ట్రావెల్ కంపెనీని కూడా నడుపుతున్నారు. అయితే ప్రాంజల్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.రేవ్ పార్టీలో డాక్టర్ ప్రాంజల్ ఖేవాల్కర్ అరెస్టు అయిన దరిమిలా ఆయనకు సంబంధించిన మునుపటి వివాదాలు ఇప్పుడు వెలికివస్తున్నాయి. గతంలో సామాజిక కార్యకర్త అంజలి దమానియా.. ప్రాంజల్ ఖేవాల్కర్పై పలు ఆరోపణలు చేశారు. ఆయన మహారాష్ట్రలోని జల్గావ్ ఆర్టీఓలో లైట్ మోటార్ వెహికల్ (ఎల్ఎంవీ) కేటగిరీ కింద సోనాటా లిమోజిన్‌ను నమోదు చేశారని, అది చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు. దేశంలో అంబాసిడర్ లిమోజిన్లకు మాత్రమే చట్టబద్ధంగా అనుమతి ఉందని దమానియా వాదించారు. ఆ కారును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా తాజాగా రేవ్ పార్టీపై దాడి చేసిన పోలీసులు హడప్సర్లోని రోహిణి ఖడ్సే బంగ్లాను కూడా సోదా చేశారు. పార్టీలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ప్రాంజల్ ఖేవాల్కర్ను సస్సూన్ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. -
ప్రాంజల జంటకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ జూనియర్ టెన్నిస్ సర్క్యూట్లో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆరెంజ్ బౌల్’ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సంచలనం సృష్టించింది. బాలికల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి తమారా జిదాన్సెక్ (స్లొవేనియా)తో కలిసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన డబుల్స్ ఫైనల్లో ప్రాంజల-తమారా ద్వయం 6-2, 6-2తో ఎలెని క్రిస్టోఫి (గ్రీస్)-అనస్తాసియా డెటియుక్ (మాల్దొవా) జంటపై గెలిచింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో 1947 నుంచి జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ తరఫున అండర్-18 విభాగంలో యూకీ బాంబ్రీ (2008లో), అండర్-16 విభాగంలో శ్యామ్ మినోత్రా (1961లో) సింగిల్స్ టైటిల్స్‌ను సాధించారు.