క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో ఒమెగా బాస్కెట్‌బాల్ క్లబ్ 66-57తో కేవీబీఆర్ స్టేడియం క్లబ్‌పై విజయం సాధించింది.
	క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీ
	హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో ఒమెగా బాస్కెట్‌బాల్ క్లబ్ 66-57తో కేవీబీఆర్ స్టేడియం క్లబ్‌పై విజయం సాధించింది. సికింద్రాబాద్ వైఎంసీఏ కోర్టులో బుధవారం జరిగిన ఈ లీగ్ పోరులో ఒమెగా జట్టులో సాయి (35) అదరగొట్టాడు. క్రమం తప్పకుండా పాయింట్లు చేయడంలో సఫలమయ్యాడు. మింటు 11 పాయింట్లు చేశాడు. కేవీబీఆర్ జట్టులో మిథిల్ 30, దినేశ్ 21 పాయింట్లు సాధించారు. మిగతా మ్యాచ్‌ల్లో ఎఫ్‌ఐబీఏ 54-34తో స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్ ‘ఎ’ జట్టుపై గెలిచింది. ఎఫ్‌ఐబీఏ తరఫున రేవంత్ 17, శుభాంకర్ 8 పాయింట్లు చేశారు.
	
	
	స్టూడెంట్స్ జట్టులో సంజయ్ కుమార్ (18), ఆకాశ్ (6) రాణించారు. మూడో మ్యాచ్‌లో బీహెచ్‌ఈఎల్ ‘బి’ జట్టు 47-17తో రహీంపురా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై నెగ్గింది. బీహెచ్‌ఈఎల్ జట్టులో ప్రణీత్ (15), హరీశ్ (9) ఆకట్టుకున్నారు. రహీంపురా తరఫున శ్రీనాథ్ 8, రవీందర్‌నాథ్ 6 పాయింట్లు చేశారు. చివరి మ్యాచ్‌లో కేపీహెచ్‌బీ 55-40తో హైదరాబాద్ లీడర్స్‌పై గెలుపొందింది. కేపీహెచ్‌బీ జట్టులో లెండిల్ 15, సాయి 13 పాయింట్లు చేశారు. లీడర్స్ తరఫున నగేశ్ (9), శివ (10) ఆకట్టుకున్నారు.
	 
	14, 15 తేదీల్లో ఇండిపెండెన్స్ టోర్నీ
	స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎంసీఏ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో ఇండిపెండెన్స్ డే బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. మహిళలు, పురుషుల విభాగాల్లో రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయి. వివరాలకు రాజారెడ్డి(9666600091)ని సంప్రదించవచ్చు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
