జాతీయ అండర్‌–13 చెస్‌ చాంప్‌ రిత్విక్‌ | National Under-13 Chess Champ Raja Ritwick is the winner | Sakshi
Sakshi News home page

జాతీయ అండర్‌–13 చెస్‌ చాంప్‌ రిత్విక్‌

Jul 1 2017 12:52 AM | Updated on Sep 5 2017 2:52 PM

జాతీయ అండర్‌–13 చెస్‌ చాంప్‌ రిత్విక్‌

జాతీయ అండర్‌–13 చెస్‌ చాంప్‌ రిత్విక్‌

అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ అండర్‌–13 చెస్‌ చాంపియన్‌షిప్‌ ఓపెన్‌ విభాగంలో తెలంగాణ ప్లేయర్‌ రాజా రిత్విక్‌ విజేతగా నిలిచాడు.

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ అండర్‌–13 చెస్‌ చాంపియన్‌షిప్‌ ఓపెన్‌ విభాగంలో తెలంగాణ ప్లేయర్‌ రాజా రిత్విక్‌ విజేతగా నిలిచాడు. పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన ఈ టోర్నీలో క్యాండిడేట్‌ మాస్టర్‌ (సీఎం) హోదా ఉన్న రిత్విక్‌ నిర్ణీత 11 రౌండ్‌ల తర్వాత 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

తెలంగాణకే చెందిన మరో ప్లేయర్‌ కుశాగ్ర మోహన్‌ 8.5 పాయింట్లు సంపాదించి రన్నరప్‌గా నిలిచాడు. మొత్తం 11 గేమ్‌లు ఆడిన రిత్విక్‌ ఎనిమిది గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. ఈ విజయంతో రాజా రిత్విక్‌ త్వరలో జరిగే ఆసియా యూత్, ప్రపంచ యూత్, కామన్వెల్త్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement