ఈ ఏడాది కొత్త టాలెంట్‌తో..: రైనా | MS Dhoni Is Best Captain India Ever Had, Raina | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది కొత్త టాలెంట్‌తో..: రైనా

Feb 13 2020 5:34 PM | Updated on Feb 13 2020 6:03 PM

MS Dhoni Is Best Captain India Ever Had, Raina - Sakshi

చెన్నై:  ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మరింతో జోష్‌తో బరిలోకి దిగుతున్నామని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా పేర్కొన్నాడు. ఈ ఏడాది సరికొత్త టాలెంట్‌తో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్నామన్నాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ తమిళ్‌నిర్వహించిన  ‘ ది సూపర్‌ కింగ్స్‌ షో’లో మాట్లాడిన రైనా.. హజల్‌వుడ్‌, సామ్‌ కరాన్‌ వంటి విభిన్నమైన ఆటగాళ్లతో ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ‘ ఈ ఏడాది మా జట్టులో చాలా మంది కొత్తవారితో దిగుతున్నాం. తమిళనాడు బౌలర్‌ సాయి కిషోర్‌ దగ్గర్నుంచీ హజల్‌వుడ్‌, కరాన్‌, పియూష్‌ చావ్లాలు ఈసారి మా జట్టులో ఉన్నారు. (ఇక్కడ చదవండి; ‘ఆర్‌సీబీ’ పేరులో మార్పు?)

వీరంతా టాలెంటెడ్‌ క్రికెటర్లు. అటు సీనియర్లు, ఇటు యువ క్రికెటర్లతో మా జట్టు నిండి ఉంది. దాంతో మాకు మరింత మంది అభిమానుల మద్దతు లభిస్తుంది. మేము కూడా ఫ్యాన్స్‌ ఇచ్చే ఉత్సాహంతో మరింత ఎనర్జీగా ఐపీఎల్‌లో అలరిస్తాం. అన్ని రకాల క్రికెటర్లు మా జట్టులో ఉన్నారు’ అని రైనా తెలిపాడు. ఇక సీఎస్‌కే కెప్టెన్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై రైనా ప్రశంసలు కురిపించాడు. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్‌ ధోనినే అంటూ కొనియాడాడు. భారత్‌ జట్టును విజయవంతంగా నడిపించినా, ఐపీఎల్‌లో చెన్నైను ఉన్నత స్థానంలో నిలిపినా అది ధోనికే సాధ్యమంటూ రైనా ప్రశంసించాడు. . ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 24 వరకు ఐపీఎల్‌-2020 జరుగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement