మెరిసిన మిథాలీ.. సఫారీల లక్ష్యం 167 | mithali raj half century in 5th t20 | Sakshi
Sakshi News home page

మిథాలీ మెరుపులు.. సఫారీల లక్ష్యం 167

Feb 24 2018 6:37 PM | Updated on Feb 24 2018 6:37 PM

mithali raj half century in 5th t20 - Sakshi

కేప్‌టౌన్‌‌ : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళా క్రికెట్‌ జట్టు జోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఐదవ టీ20లో భారత్‌ 20 ఓర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  మిథాలీ రాజ్‌ 62 పరుగులతో చెలరేగింది. 50 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్లతో అద్భుతంగా ఆడింది.

బ్యాటింగ్‌కు వచ్చిన మిథాలీ రాజ్‌, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం అందించారు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మృతి వెనుదిరిగింది. అనంతరం రంగంలోకి దిగిన రోడ్రిగస్‌ మిథాలితో కలిసి స్కోరును ముందుకు కదిలించింది. 34 బంతుల్లో (మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) 44 పరుగులు చేసింది. కాప్‌, ఖాకా, ఇస్మైల్‌లు తలో వికెట్‌ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement