అమీర్ ఖాన్కు నాకౌట్ పంచ్! | Mexican professional boxer Saul 'Canelo' Alvarez knocked out Britain's Amir Khan | Sakshi
Sakshi News home page

అమీర్ ఖాన్కు నాకౌట్ పంచ్!

May 8 2016 6:30 PM | Updated on Sep 3 2017 11:41 PM

అమీర్ ఖాన్కు నాకౌట్ పంచ్!

అమీర్ ఖాన్కు నాకౌట్ పంచ్!

బ్రిటన్ బాక్సర్ అమీర్ ఖాన్.. మెక్సికన్ ప్రొఫెషనల్ బాక్సర్ సాల్ కానెలో అల్వరేజ్ చేతిలో నాకౌట్ ఓటమి చవిచూశాడు.

లాస్వెగాస్: బ్రిటన్ బాక్సర్ అమీర్ ఖాన్.. మెక్సికన్ ప్రొఫెషనల్ బాక్సర్ సాల్ కానెలో అల్వరేజ్ చేతిలో నాకౌట్ ఓటమి చవిచూశాడు. ఆరు రౌండ్ల పోరులో అమీర్ ఖాన్ ఆది నుంచీ దూకుడును ప్రదర్శించినా చివరి రౌండ్లో క్షణకాలం పాటు కోల్పోయిన ఏకాగ్రత మూలంగా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో మిడిల్ వెయిట్ విభాగంలో వరల్డ్ ఛాంపియన్ షిప్ను సాల్ కానెలో నిలుపుకున్నడు.

బాక్సింగ్ రింగ్లో మొదటి రౌండ్ నుంచి చురుగ్గా కదిలిన అమీర్ ఖాన్ మెరుపులాంటి పంచ్లతో ఆకట్టుకున్నాడు. మూడు, నాలుగో రౌండ్లలో అల్వరేజ్పై పంచ్ల వర్షం కురిపించాడు. అయితే ఐదో రౌండ్కు వచ్చే సరికి అల్వరేజ్ చెలరేగి తన ఛాంపియన్ గేమ్ను అమీర్కు రుచిచూపించాడు. చివరి రౌండ్లో అదే జోరును కొనసాగిస్తూ.. మెరుపులాంటి రైట్ హ్యాండ్తో దాడి చేయడంతో అమీర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో మరో 23 సెకన్ల సమయం ఉందనగా మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ అనంతరం అల్వరేజ్ 'మాన్స్టర్ పంచ్'కు అభినందనలు తెలుపుతూ అమీర్ ట్వీట్ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement