breaking news
alvarez
-
46వేల చార్జింగ్ స్టేషన్లు కావాలి
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలంటే 2030 నాటికి దేశీయంగా 46,000 చార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయని ప్రొఫెషనల్ సర్వీసుల సంస్థ అల్వారెజ్ అండ్ మార్సల్ ఒక నివేదికలో పేర్కొంది. ఈవీ చార్జర్ల నిష్పత్తి చైనా.. నెదర్లాండ్స్‌లో 6గాను, అమెరికాలో 19గాను, భారత్‌లో 135గాను ఉన్నట్లు తెలిపింది. అంటే చైనాలో ప్రతి 6 ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక చార్జర్ ఉండగా.. భారత్‌లో మాత్రం ప్రతి 135 వాహనాలకు ఒకటి ఉందని వివరించింది. ఎలక్ట్రిక్ వాహనాల సదస్సు ది ఈవీకాన్‌ఇండియా 2022 సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. ఈవీల వినియోగానికి ఎదురవుతున్న సవాళ్ళను ఇందులో ప్రస్తావించారు. ప్రధానంగా ఖరీదు, రేంజి (మైలేజి)పరమైన ఆందోళన, సరఫరా వ్యవస్థ, ఉత్పత్తి భద్రత .. నాణ్యత, రుణ సదుపాయం అంతగా అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు వీటిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. భారీ వాహన పరిశ్రమ, కాలుష్య సమస్యల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈవీల వినియోగం, నవకల్పనలు వేగవంతంగా పెరగడానికి భారత్‌లో ఇదే సరైన సమయమని వివరించింది. సరఫరా వ్యవస్థ, చార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడి ఫైనాన్సింగ్‌కు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతే వచ్చే అయిదేళ్లలో పరిశ్రమలోని అనుబంధ విభాగాలు సగటున 50–100 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని అల్వారెజ్ అండ్ మార్సల్ ఇండియా ఎండీ మనీష్ సైగల్ చెప్పారు. -
అమీర్ ఖాన్‌కు నాకౌట్ పంచ్!
లాస్‌వెగాస్: బ్రిటన్ బాక్సర్ అమీర్ ఖాన్.. మెక్సికన్ ప్రొఫెషనల్ బాక్సర్ సాల్ కానెలో అల్వరేజ్ చేతిలో నాకౌట్ ఓటమి చవిచూశాడు. ఆరు రౌండ్ల పోరులో అమీర్ ఖాన్ ఆది నుంచీ దూకుడును ప్రదర్శించినా చివరి రౌండ్లో క్షణకాలం పాటు కోల్పోయిన ఏకాగ్రత మూలంగా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో మిడిల్ వెయిట్ విభాగంలో వరల్డ్ ఛాంపియన్ షిప్‌ను సాల్ కానెలో నిలుపుకున్నడు. బాక్సింగ్ రింగ్‌లో మొదటి రౌండ్ నుంచి చురుగ్గా కదిలిన అమీర్ ఖాన్ మెరుపులాంటి పంచ్‌లతో ఆకట్టుకున్నాడు. మూడు, నాలుగో రౌండ్లలో అల్వరేజ్పై పంచ్‌ల వర్షం కురిపించాడు. అయితే ఐదో రౌండ్‌కు వచ్చే సరికి అల్వరేజ్ చెలరేగి తన ఛాంపియన్ గేమ్‌ను అమీర్‌కు రుచిచూపించాడు. చివరి రౌండ్లో అదే జోరును కొనసాగిస్తూ.. మెరుపులాంటి రైట్ హ్యాండ్‌తో దాడి చేయడంతో అమీర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో మరో 23 సెకన్ల సమయం ఉందనగా మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ అనంతరం అల్వరేజ్ 'మాన్స్టర్ పంచ్'కు అభినందనలు తెలుపుతూ అమీర్ ట్వీట్ చేశాడు.