మళ్లీ టాప్‌ ప్లేస్‌కు కోహ్లి | Kohli is back to being the leading run scorer in IPL history | Sakshi
Sakshi News home page

మళ్లీ టాప్‌ ప్లేస్‌కు కోహ్లి

May 7 2018 10:53 PM | Updated on May 7 2018 10:54 PM

Kohli is back to being the leading run scorer in IPL history - Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చరిత‍్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మళ్లీ టాప్‌ ప్లేస్‌ను ఆక్రమించాడు. ప్రస్తుతం అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లి, సురేశ్‌ రైనాల మధ్య  పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మరొకసారి రైనాను వెనక్కునెట్టిన కోహ్లి అగ్రస్థానంలో నిలిచాడు.

సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి తొలిస్థానాన్ని  కైవసం చేసుకున్నాడు. కోహ్లి 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రైనాను అధిగమించాడు. ప్రస్తుతం కోహ్లి(4,814) తొలి స్థానంలో ఉండగా, రైనా(4,801) రెండో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement