ధోని పోరాడినా.. | Kings Punjab beat Chennai Super Kings by 4 runs | Sakshi
Sakshi News home page

ధోని పోరాడినా..

Apr 15 2018 11:50 PM | Updated on Apr 15 2018 11:50 PM

Kings Punjab beat Chennai Super Kings by 4 runs - Sakshi

మొహాలీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 4 పరుగుల తేడాతో  విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ పంజాబ్‌   ఏడు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది .గేల్‌‌(63; 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ సాధించగా, ‌రాహుల్‌(37;22 బంతుల్లో  7 ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. ఆపై మయాంక్‌ అగర్వాల్‌(30; 19 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు), యువరాజ్‌ సింగ్ ‌(20;13 బంతుల్లో 2 ఫోర్లు 1సిక్స్‌), కరుణ్‌ నాయర్‌(29; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) లు బ్యాట్‌ ఝుళిపించడంతో కింగ్స్‌ పంజాబ్‌ భారీ స్కోరు చేసింది.

ఆ తర్వాత 198 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన చెన్నై 193 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. చెన్నై ఆటగాళ్లలో అంబటి రాయుడు(49;35 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్‌), ఎంఎస్‌ ధోని(79 నాటౌట్‌; 44 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌ర్‌‌)లు మాత్రమే రాణించినా ఓటమి తప్పలేదు. ధోని కడవరకూ పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement