ఆల్‌ టైమ్‌ టాప్‌-10లో అతనొకడు: కపిల్‌ | Kapil Dev ranks Virat Kohli among top 10 players of all time | Sakshi
Sakshi News home page

ఆల్‌ టైమ్‌ టాప్‌-10లో అతనొకడు: కపిల్‌

Aug 2 2018 12:07 PM | Updated on Aug 2 2018 3:18 PM

Kapil Dev ranks Virat Kohli among top 10 players of all time - Sakshi

న్యూఢిల్లీ: ఆధునిక క్రికెట్‌ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకడు. ఫార్మాట్ ఏదైనా అందుకు అతికినట్లు సరిపోయే ఆటగాడు కోహ్లి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు కోహ్లి. వన్డే క్రికెట్‌లో 35 సెంచరీలు నమోదు చేసి ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (49) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

కోహ్లి గురించి ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర‍్య్వూలో కపిల్‌ దేవ్‌ మాట్లాడుతూ..  సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్‌ల సరసన విరాట్ కోహ్లి పేరును చేర్చొచ్చని తెలిపాడు. ఆల్‌ టైమ్‌ టాప్‌-10 క్రికెటర్లలో కోహ్లి తప్పకుండా స్థానం ఉంటుందన్నాడు. 200 ఏళ్ల క్రికెట్‌ చరిత్రను పర్యవేక్షిస్తే దిగ్గజ క్రికెటర్ల సరసన ఇప్పటికే కోహ్లి స్థానం దక్కించుకున్నాడన్నాడు. ఇక టీమిండియా విజయాల్లో బౌలర్ల పాత్ర గురించి ప్రస్తావించగా.. స్సిన్నర్‌ అశ్విన్ కీలక పాత్ర పోషించాడని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. గత 150 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ బౌలరూ తక్కువ సమయంలో అశ్విన్‌‌లా ఎక్కువ వికెట్లు తీయలేదని కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement