గెలిచే మ్యాచ్‌ 5 నిమిషాల్లో డ్రా! | Indian Womens Hockey Team Plays Out Draw With Britain | Sakshi
Sakshi News home page

గెలిచే మ్యాచ్‌ 5 నిమిషాల్లో డ్రా!

Oct 5 2019 10:08 AM | Updated on Oct 5 2019 10:08 AM

Indian Womens Hockey Team Plays Out Draw With Britain - Sakshi

మార్లో (ఇంగ్లండ్‌): ఇంగ్లండ్‌ పర్యటనను భారత మహిళల హాకీ జట్టు ‘డ్రా’తో ముగించింది. శుక్రవారం జరిగిన ఆఖరి పోరులో భారత్‌ 2–2తో ఇంగ్లండ్‌తో ‘డ్రా’ చేసుకుంది. నిజానికి ఈ మ్యాచ్‌ లో భారత అమ్మాయిలు చివరిదాకా గెలిచేస్థితిలో నిలిచారు. అయితే ఆఖరి క్వార్టర్‌లో ఇంగ్లండ్‌ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేయడంతో మ్యాచ్‌ డ్రా అయింది. ఆరంభంలోనే నవ్‌జోత్‌ కౌర్‌ (8వ ని.) గోల్‌ చేయడంతో తొలి క్వార్టర్‌లోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

చివరి క్వార్టర్‌లో గుర్జీత్‌ కౌర్‌ (48వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్‌ 2–0తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. అయితే మ్యాచ్‌ ముగిసేదశలో ఇంగ్లండ్‌ పట్టు బిగించింది. ఎలిజబెత్‌ నీల్‌ (55వ ని.), అనా టోమన్‌ (60వ ని.)  చెరో గోల్‌ చేయడంతో ఆతిథ్య జట్టు ‘డ్రా’తో గట్టెక్కింది. ఈ పోరు ద్వారా భారత గోల్‌ కీపర్‌ సవిత 200 మ్యాచ్‌లు ఆడిన ఘనతను సొంతం చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement