క్వార్టర్స్‌లో భారత్‌ | Indian Team Entered The Quarterfinals of The Volleyball Championship | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో భారత్‌

Sep 16 2019 3:26 AM | Updated on Sep 16 2019 3:26 AM

Indian Team Entered The Quarterfinals of The Volleyball Championship - Sakshi

టెహ్రాన్‌ (ఇరాన్‌): ఆసియా సీనియర్‌ పురుషుల వాలీబాల్‌ ఛాంపియన్షిప్ లో భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘సి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 22–25, 25–12, 25–21, 25–19తో ఒమన్‌ జట్టును ఓడించింది. లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యాక గ్రూప్‌ ‘సి’లో భారత్‌ ఆరు పాయింట్లతో రెండో స్థానానికి చేరగా.. తొమ్మిది పాయింట్లతో చైనా టాపర్‌గా నిలిచింది. క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన భారత్‌ వచ్చే ఏడాది చైనాలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌ ఆసియా జోన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌కు కూడా అర్హత సాధించింది. క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ‘ఇ’లో భారత్‌తోపాటు చైనా, ఇరాన్, ఆ్రస్టేలియా... గ్రూప్‌ ‘ఎఫ్‌’లో దక్షిణ కొరియా, జపాన్, చైనీస్‌ తైపీ, పాకిస్తాన్‌ ఉన్నాయి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement