మిథాలీ రాజ్‌ మరో మైలురాయి | The Indian captain Mithali Raj is todays 200th ODI | Sakshi
Sakshi News home page

మిథాలీ రాజ్‌ మరో మైలురాయి

Feb 1 2019 3:16 AM | Updated on Feb 1 2019 8:29 AM

The Indian captain Mithali Raj is todays 200th ODI - Sakshi

హామిల్టన్‌: అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 200 వన్డేలు ఆడిన తొలి క్రికెటర్‌గా భారత కెప్టెన్, హైదరాబాద్‌కు చెందిన మిథాలీ రాజ్‌ రికార్డు సృష్టించనుంది. నేడు న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు మూడో వన్డేలో బరిలోకి దిగనుంది. ఇప్పటికే 2–0తో సిరీస్‌ నెగ్గిన భారత్‌ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలనే లక్ష్యంతో ఉంది. 1999లో ఐర్లాండ్‌పై తొలి వన్డే ఆడిన మిథాలీ రాజ్‌ తన 20 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు 199 వన్డేలు ఆడింది. 179 ఇన్నింగ్స్‌ ఆడిన ఆమె 51.66 సగటుతో 6,613 పరుగులు చేసి మహిళల క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మిథాలీ 7 సెంచరీలు, 52 అర్ధ సెంచరీలు చేసింది. 51 సార్లు నాటౌట్‌గా నిలిచిన ఆమె ఆరుసార్లు డకౌట్‌గా వెనుదిరిగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement