భారత్‌ మాతా కీ జై: కివీస్‌ ఫ్యాన్‌ | IND VS NZ 3rd T20: New Zealand Fan Chants Bharat Mata Ki Jai | Sakshi
Sakshi News home page

భారత్‌ మాతా కీ జై: కివీస్‌ ఫ్యాన్‌

Jan 30 2020 11:37 AM | Updated on Jan 30 2020 11:37 AM

IND VS NZ 3rd T20: New Zealand Fan Chants Bharat Mata Ki Jai - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 ఉత్కంఠ పోరులో టీమిండియానే పైచేయి సాధించిన విషయం తెలిసిందే. బంతి బంతికి సమీకరణాలు మారిన నేపథ్యంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో అంతకుమించిన ఉత్కంఠతతో మ్యాచ్‌ను తిలకించారు. అంతేకాకుండా కోహ్లి సేనకు మద్దతుగా వారిని ఉత్సాహపరుస్తూ ‘కమాన్‌ ఇండియా’ అంటూ నినాదాలు చేశారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం టీమిండియా అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన స్టేడియంలో చోటు చేసుకుంది. 

టీమిండియాకు మద్దతుగా అభిమానులు ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ నినాదాలకు ఆకర్షితుడైన ఓ కివీస్‌ ఫ్యాన్‌ కూడా భారత బృందంలో చేరిపోయాడు. అ క్రమంలో ఆ నినాదాన్ని తొలుత నేర్చుకుని ఆతర్వాత బిగ్గరగా ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ నినదించడం ప్రారంభించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. నిమిషాల వ్యవధిలోనే లైక్‌లు, షేర్‌లతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో హోరెత్తిపోయింది.ఇక మహ్మద్‌ షమీ, రోహిత్‌ శర్మలు తమ అనుభవంతో ఒత్తిడిలో టీమిండియాను గెలిపించగా, ఒత్తిడిలో ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు చిత్తయింది. దీంతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కివీస్‌ టీమిండియాకు చేజార్చుకుంది. 

చదవండి:
‘సూపర్‌’ ఓటమి.. నిరాశలో విలియమ్సన్‌!

ఉత్కం‘టై’న మ్యాచ్‌కు సూపర్‌ ముగింపు

దగ్గరి దారులు వెతక్కండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement