సెమీస్‌లో జయరామ్ పరాజయం | Image for the news result Ajay Jayaram suffers semi-final heartache, crashes out of US Open Grand Prix Gold | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో జయరామ్ పరాజయం

Jul 11 2016 2:02 AM | Updated on Aug 24 2018 8:44 PM

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది.

ఎల్ మోంటి (అమెరికా): యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారత్ నుంచి బరిలో మిగిలిన అజయ్ జయరామ్ సెమీఫైనల్లో నిష్ర్కమించాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ జయరామ్ 10-21, 14-21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో ఒకదశలో జయరామ్ వరుసగా పది పాయింట్లు కోల్పోయాడు. రెండో గేమ్‌లో జయరామ్ కాస్త పోటీనిచ్చినా ఫలితం లేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement