మణికట్టుతో కాదు.. వేళ్లతోనే తిప్పేస్తా: రషీద్

I call myself a finger spinner, says Rashid Khan - Sakshi

డెహ్రాడూన్‌: అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ యువ సంచలనం రషీద్‌ ఖాన్‌ను అందరూ అద్భుతమైన మణికట్టు స్సిన్నర్‌ అని పిలుస్తుంటే, తను మాత్రం మణికట్టు కంటే ఎక్కువగా వేళ్ల కొనలతోనే బంతిని తిప్పుతానంటున్నాడు. ఇలా వేలి కొనలతో బంతిని తిప్పడం వల్ల వేగంగా విసరడానికి అవకాశం లభిస్తుందని చెబుతున్నాడు.

‘లెగ్ స్పిన్ ఎలా వేయాలో నాకెవరూ చెప్పలేదు. ఆ అవకాశం కూడా నాకు లేదు. కాకపోతే ఐదారేళ్ల క్రితం షాహిద్ అఫ్రిది, అనిల్ కుంబ్లేల వీడియోలను చూసేవాణ్ని. ఇప్పటికీ ఖాళీ సమయాల్లో కుంబ్లే బౌలింగ్ వీడియోలను చూస్తుంటా. లెగ్‌ స్సిన్‌లో ఎప్పటికప‍్పుడు కొత్త విషయాల‍్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతా. ఎక్కువగా మణికట్టును ఉపయోగించను. వేళ్లతోనే బంతిని తిప్పడానికి యత్నిస్తా. ఒక లెగ్‌స్పిన్నర్‌ ఇలా బౌలింగ్‌ వేయడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుంది’ అని రషీద్‌ ఖాన్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top