హర్ష సంచలనం | Harsha Bharatkoti created sensation | Sakshi
Sakshi News home page

హర్ష సంచలనం

Sep 29 2017 12:27 AM | Updated on Sep 29 2017 12:27 AM

Harsha Bharatkoti created sensation

సాక్షి, హైదరాబాద్‌: ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ హర్ష భరత్‌కోటి సంచలనం సృష్టించాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో... భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్, 2670 ఎలో రేటింగ్‌ కలిగిన ఆదిబన్‌తో జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌లో అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎం) హోదా, 2394 ఎలో రేటింగ్‌ ఉన్న హర్ష కేవలం 40 ఎత్తుల్లో విజయం సాధించాడు.

అయితే భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ సంతోష్‌ గుజరాతితో జరిగిన ఆరో రౌండ్‌లో హర్ష 42 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఆరో రౌండ్‌ తర్వాత హర్ష నాలుగు పాయింట్లతో 17వ ర్యాంక్‌లో ఉన్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement