హర్‌ప్రీత్‌ సింగ్‌ జోరు | Harpreet Singh Leads in Second Day Of Sailing | Sakshi
Sakshi News home page

హర్‌ప్రీత్‌ సింగ్‌ జోరు

Jul 5 2019 2:04 PM | Updated on Jul 5 2019 2:04 PM

 Harpreet Singh Leads in Second Day Of Sailing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ జలాల్లో కనువిందు చేస్తోన్న ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌ పోటీల్లో రెండోరోజూ ఆర్మీ యాటింగ్‌ నోడ్‌ (ఏవైఎన్‌) సెయిలర్ల హవా కొనసాగింది. గురువారం లేజర్‌ స్టాండర్డ్, లేజర్‌ రేడియల్, 470 క్లాస్, ఫిన్‌ ఈవెంట్‌లలో జరిగిన అన్ని రేసుల్లోనూ ఏవైఎన్‌ సెయిలర్లే విజేతలుగా నిలిచారు. లేజర్‌ స్టాండర్డ్‌ నాలుగు, ఐదు రేసుల్లో హర్‌ప్రీత్‌ సింగ్‌ విజేతగా నిలిచాడు. చివరిదైన ఆరో రేసును జితేశ్‌ గెలుపొందాడు. రేడియల్‌ ఈవెంట్‌ నాలుగు, ఐదు, ఆరు రేసుల్ని వరుసగా జితేశ్, హర్‌ప్రీత్‌ సింగ్, షరీఫ్‌ ఖాన్‌ చేజిక్కించుకున్నారు.

లేజర్‌ 4.7 ఈవెంట్‌లో రితిక (ఎన్‌ఎస్‌ఎస్‌), అజయ్‌ (ఈఎంఈఎస్‌ఏ) వరుసగా నాలుగు, ఐదు రేసుల్లో అగ్రస్థానంలో నిలిచారు. 470 క్లాస్‌లో పీపీ ముత్తు–ఎస్‌సీ సింఘా జంట నాలుగు, ఆరు రేసుల్ని గెలుచుకోగా... అతుల్‌–సీహెచ్‌ఎస్‌ రెడ్డి జోడీ ఐదో రేసులో విజేతగా నిలిచింది. ఆర్‌ఎస్‌:ఎక్స్‌ విభాగం నాలుగో రేసులో ఈఎంఈఎస్‌ఏ సెయిలర్‌ డేన్‌ కోయిలో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. జెరోమ్, మన్‌ప్రీత్‌ సింగ్‌ మిగతా రేసుల్లో ముందంజ వేశారు. ఫిన్‌ విభాగంలో నాలుగో రేసును వివేక్‌ సొంతం చేసుకోగా.. మిగతా రెండు రేసుల్లో స్వతంత్ర సింగ్‌ విజేతగా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement