హార్ధిక్‌ పోస్టుకు స్పందించిన సానియా! | Hardik Pandya Shares Picture With Fiancee Natasa Stankovic | Sakshi
Sakshi News home page

‘మీ జంట చాలా అందంగా ఉంది’

Jan 25 2020 3:40 PM | Updated on Jan 25 2020 4:13 PM

Hardik Pandya Shares Picture With Fiancee Natasa Stankovic - Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా తనకు కాబోయే భార్య నటాషా స్టాన్‌వికోవిచ్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. కాగా పాండ్యా వెన్ను నొప్పి కారణంగా న్యూజిలాండ్‌ టూర్‌కు జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక ఆ గాయం నుంచి కొలుకుంటున్న పాండ్యా కాబోయే భార్యతో కలిసి ఉన్న అందమైన ఫొటోను శుక్రవారం తన అభిమానులతో పంచుకున్నాడు. ఎరుపు రంగు హార్ట్‌ ఎమోజీ జత చేసి షేర్‌ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పాండ్యా షేర్‌ చేసిన  ఈ పోస్టుకు అభిమానులంతా తన అభిమాన ఆటగాడికి హార్ట్‌ వామింగ్‌ విషెస్‌ తెలుపుతున్నారు. ‘మీ జంట చాలా అందంగా ఉంది. గెట్‌ వెల్‌ సూన్‌ మిస్టర్‌ ఆల్‌రౌండర్‌..  వీ మిస్‌ యూ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ జంటను చూసి భారత టెన్నిస్‌ స్టార్‌​ సానియా మీర్జా సైతం ‘హార్ట్‌ ఐస్‌’ ఎమోజీతో తన స్పందనను తెలిపారు. 

❤️

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

కాగా హార్ధిక్‌ న్యూజిలాండ్‌తో జరిగే ఇంటర్నేషనల్‌ టీ20 సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. తొలుత భారత ‘ఎ’ జట్టుకు ఎంపికైన పాండ్యా ఫిట్‌నెస్‌ పరీక్షలలో విఫలమై న్యూజిలాండ్‌లో జరిగే వన్‌ డే, టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా న్యూ ఈయర్‌ వేడుకలకు దుబాయ్‌ వెళ్లిన ఈ ఆల్‌రౌండర్‌ అక్కడే సెర్బియా నటి నటాషా స్టాన్‌వికోవిచ్‌ను నిశ్చితార్థం చేసుకున్నాడు. సన్నిహితుల మధ్య జరిగిన నిశ్చితార్థపు ఫొటోలను పాండ్యా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

అయ్యో.. హార్దిక్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement