బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ మానేశా: పాండ్యా | Hardik Pandya Says Have Stopped Batting Practising  | Sakshi
Sakshi News home page

May 7 2018 3:34 PM | Updated on May 7 2018 5:45 PM

Hardik Pandya Says Have Stopped Batting Practising  - Sakshi

హార్దిక్‌ పాండ్యా

ముంబై : బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ పూర్తిగా మానేశానని ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తెలిపాడు. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ముంబై విజయంలోకీలక పాత్ర పోషించిన ఈ స్టైలీష్‌ ప్లేయర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 

విజయానంతరం తన హిట్టింగ్‌పై స్పందిస్తూ..‘‘ నేను కొత్తగా ఏమి ప్రయత్నించ లేదు. అది ఏదో ఒకరోజు వచ్చేదే. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కూడా మానేశా. నేను భిన్నంగా ఆలోచించే వ్యక్తిని. నిజానికి నేను సానుకూలంగా ఆడాను. ఒక్క సిక్స్‌ బాదితే మైదానంలో పరిస్థితి మొత్తం మారుతోంది. దీనినే దృష్టిలో ఉంచుకునే హిట్టింగ్‌ చేశాను’ అని పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇక పాండ్యా 35( 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)లతో ముంబై 181 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

​కోల్‌కతాను 168 పరుగులకే కట్టడి చేయడంపై స్పందిస్తూ తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని, తాను కూడా సానుకూలంగా బౌలింగ్‌ చేశానని దీంతోనే వికెట్లు దక్కాయని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 19 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన పాండ్యా ఈ సీజన్‌లో 14 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. ఈ క్యాప్‌ కోసం మాత్రం ప్రయత్నించలేదని, క్యాప్‌ అందుకోవడం సంతోషంగా ఉందన్నాడు. తమ జట్టు సానుకూల దృక్పథంతో ముందుకెళ్తుందని, టైటిల్‌ రేసులో నిలుస్తామని ఈ యువ ఆల్‌రౌండర్‌ ధీమా వ్యక్తం చేశాడు. 10 మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగు మాత్రమే గెలిచింది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ముంబై ప్రతీ మ్యాచ్‌ గెలువాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement