ఐపీఎల్‌: వావ్‌ వాటే..క్యాచ్‌!

Gowtham Takes Stunning Catch - Sakshi

పుణె : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా చెన్నైసూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు కృష్ణప్ప గౌతమ్‌ అద్భుత ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 14 ఓవర్‌ రెండో బంతికి చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని భారీ షాట్‌ ఆడాడు. లాంగ్‌ ఆన్‌ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న గౌతమ్‌ గాల్లోకి ఎగిరి అద్భుతంగా బంతిని అందుకున్నాడు. తొలుత బంతి గౌతమ్‌ చేతి నుంచి చేజారినట్టే జారి చిక్కింది. దీంతో ధోని(5) పెవిలియన్‌కు చేరాడు. ఊరించే గూగ్లీతో గోపాల్‌ ధోనిని బోల్తా కొట్టించాడు. ఈ అద్భుత క్యాచ్‌కు మైదానంలో అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. గత మ్యాచ్‌లో చెలరేగి ఫామ్‌లోకి వచ్చిన ధోని.. గౌతమ్‌ అద్భుత ఫీల్డింగ్‌తో నిరాశగా వెనుదిరిగాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top