
మైదానంలో పడిన బూట్లతో చెన్నై ఆటగాళ్లు జడేజా, డుప్లెసిస్
సాక్షి, హైదరాబాద్ : ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల్లో కొందరు చెన్నై ఆటగాళ్లపై బూట్లు విసిరిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన చెన్నై ఫ్యాన్స్ ఆటగాళ్లకు క్షమాపణలు తెలిపారు. దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని అన్నారు. కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు కోసం ఉధృతంగా ఆందోళనలు జరగుతున్న సమయంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించరాదంటూ ఆందోళనకారులు మొదటినుంచీ వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే)-కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆందోళనకారులు మైదానంలోకి చెప్పులు విసిరారు. కోల్‌కతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అప్పర్ టయర్ నుంచి మెయిన్ పెవిలియన్‌లోకి కొందరు వ్యక్తులు చెప్పులు విసిరారు. దీంతో మ్యాచ్‌లో ఆడని డుప్లెసిస్, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా మైదానంలో పడిన చెప్పులకు బయటకు విసిరేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డుప్లెసిస్, జడేజాలను ట్విటర్‌లో ట్యాగ్ చేస్తూ.. ‘మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. స్టేడియంలో జరిగిన ఘటనకు చింతిస్తున్నాం. ఇందుకు క్షమాపణలు చెబుతున్నాం. మా గురించి తప్పుగా భావించొద్దు. మీరంటే మాకు అమితమైన గౌరవం ఉంది.’ అంటూ పలువురు ఫ్యాన్స్ ట్వీట్లు చేశారు.
Cringing. So Sorry @faf1307 , @imjadeja , @ChennaiIPL . pic.twitter.com/mEgumYofYo
— kasturi shankar (@KasthuriShankar) April 10, 2018