ధోని ప్రధాని కావాలి!

Fans Root For MS Dhoni To Become India PM - Sakshi

బెంగళూరు : టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆటతో మైమరిచిపోతున్న అభిమానులు.. ఏకంగా అతను దేశ ప్రధానే కావాలని తమ మనసులోని మాటను బయటపెట్టారు. గురువారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోని (48 బంతుల్లో 84 నాటౌట్‌; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో ధోని ఆటతీరుకు ముగ్దులైన అభిమానులు అతన్ని ఆకాశానికెత్తారు. ఈ నేపథ్యంలో అతని ఆటతీరును ప్రశంసిస్తూనే.. ధోని ప్రధాని అయితే బాగుండనే తమ కోరికను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మోదీ, రాహుల్‌ గాంధీలను మరిచిపోండి.. ధోనిని ప్రధానిని చేయండి’ అని ఒకరంటే.. భవిష్యత్తులో ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ అతను పోటీ చేస్తే మాత్రం అతనికే ఓటేస్తా. అతనే నా ప్రధాని. అసాధ్యమయ్యే దాన్ని కూడా సుసాధ్యం చేసే వ్యక్తి ధోని. అతనో లెజండ్‌’ అని మరొకరు.. ఈ ఎన్నికల్లో ధోని ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగితే అద్భుతంగా ఉంటుంది. అతను దేశానికి మంచి చేస్తాడు’ అని ఇంకొకరు కామెంట్‌ చేశారు.

ఇక ఉత్కంఠకరంగా సాగిన నిన్నటి(గురువారం) మ్యాచ్‌లో చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని షాట్‌ గురి తప్పడం... పరుగు కోసం ప్రయత్నించడం... బెంగళూరు కీపర్‌ పార్థివ్‌ డైర్టెక్‌ హిట్‌తో శార్దుల్‌ను రనౌట్‌ చేయడంతో చెన్నై పరాజయం పాలైంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top