సెంచరీ కొట్టలేదని బాధ లేదు: రోహిత్ | Don't regret missing out on century, says Rohit Sharma | Sakshi
Sakshi News home page

సెంచరీ కొట్టలేదని బాధ లేదు: రోహిత్

Apr 9 2015 6:32 PM | Updated on Sep 3 2017 12:05 AM

సెంచరీ కొట్టలేదని బాధ లేదు: రోహిత్

సెంచరీ కొట్టలేదని బాధ లేదు: రోహిత్

ఐపీఎల్-8 ఆరంభ మ్యాచ్ లో సెంచరీ చేయలేకపోయినందుకు బాధ లేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

కోల్ కతా: ఐపీఎల్-8 ఆరంభ మ్యాచ్ లో సెంచరీ చేయలేకపోయినందుకు బాధ లేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టాలెంటెడ్ ఇండియన్ యంగ్ ప్లేయర్స్ వల్లే కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించిందని పేర్కొన్నాడు. బుధవారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ముంబై 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో 2 పరుగుల తేడాతో రోహిత్ సెంచరీ కోల్పోయాడు. 98 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ముంబై నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేరుకుంది. కెప్టెన్ గంభీర్ తో పాటు మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో కోల్ కతా విజయం సాధించింది. స్థానిక పరిస్థితులను ఉపయోగించుకుని భారత యువ క్రికెటర్లు బాగా ఆడారని రోహిత్ శర్మ తెలిపాడు. మొదటి వికెట్ పడిన తర్వాత బ్రేక్ రాకపోవడమే తమ ఓటమికి కారణమని వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement