కమాండెంట్ సింధు... | CRPF to appoint PV Sindhu as Commandant and brand ambassador | Sakshi
Sakshi News home page

కమాండెంట్ సింధు...

Aug 30 2016 12:50 AM | Updated on Sep 4 2017 11:26 AM

కమాండెంట్ సింధు...

కమాండెంట్ సింధు...

రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మరో గౌరవం లభించనుంది.

బ్యాడ్మింటన్ స్టార్‌కు సీఆర్‌పీఎఫ్ గౌరవం!  
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మరో గౌరవం లభించనుంది. ఈ హైదరాబాద్ అమ్మారుుకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కమాండెంట్ గౌరవ హోదా ఇవ్వనుంది. దాంతోపాటు ఆమెను సీఆర్‌పీఎఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనుంది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్ హోం మంత్రిత్వశాఖకు తమ ప్రతిపాదనలు పంపించింది. లాంఛనాలు పూర్తయ్యాక అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేసి సీఆర్‌పీఎఫ్ ఈ నియామక ప్రకటన చేయనుంది.

ఈ మేరకు సింధుకు కూడా సమాచారం అందించినట్లు సీఆర్‌పీఎఫ్ వర్గాలు తెలిపాయి. సీఆర్‌పీఎఫ్‌లో కమాండెంట్ ర్యాంక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్పీ)తో సమానం. సీఆర్‌పీఎఫ్‌లో కమాండెంట్ ర్యాంక్ ఉన్న వారు వెయ్యిమందితో కూడిన దళానికి నాయకుడిగా ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement