‘అది మిగతా ఐపీఎల్‌ జట్లకు చేదువార్తే’ | Chris Gayles return is bad news for other teams in IPL 2018 | Sakshi
Sakshi News home page

‘అది మిగతా ఐపీఎల్‌ జట్లకు చేదువార్తే’

Apr 16 2018 6:12 PM | Updated on Apr 16 2018 6:29 PM

Chris Gayles return is bad news for other teams in IPL 2018 - Sakshi

మొహాలీ: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే బ్యాట్‌ ఝుళిపించడం ఆరంభించిన గేల్‌.. 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. రెండు మ్యాచ్‌ల తర్వాత కింగ్స్‌ పంజాబ్‌ జట్టులో చోటు దక్కించుకున్న గేల్‌.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కింగ్స్‌ పంజాబ్‌ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన క్రిస్‌ గేల్‌.. ఆ జట్టు ఆడే మూడో మ్యాచ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టోనిస్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన గేల్‌ తన విలువ ఏమిటో చూపించాడు. తనదైన స్టైయిల్‌లో భారీ షాట్లతో అలరించిన గేల్‌ 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు. కింగ్స్‌ పంజాబ్‌ విజయంలో ముఖ్య భూమిక పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

ఈ సీజన్‌లో గేల్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకోవడంతో సహచర ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే గేల్‌తో ప్రత్యర్థి జట్లన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన  అవసరం ఉందంటూ హెచ్చరించాడు. ‘ గేల్‌ ప‍్రదర్శన మాకు కచ్చితంగా ప్రీతిదాయకమైన వార్తే. అదే సమయంలో మిగతా ఐపీఎల్‌ జట్లకు చేదువార్త. బంతిని గేల్‌ హిట్‌ చేసిన విధానం అమోఘం. అతని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు. తనదైన రోజున గేల్‌ బ్యాట్‌తో సునామీ సృష్టిస్తాడు. గేల్‌ చెలరేగితే ఎలో ఉంటుందో మరోసారి రుజువైంది. గేల్‌ రాకతో ప్రత్యర్థి జట్లు అప్రమత్తంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఇదే ఫామ్‌ను  సీజన్‌ ఆద్యంతం కొనసాగిస్తాడని మా జట్టు యాజమాన్యం ఆశిస్తోంది’ అని కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement