
భారత్–వెస్టిండీస్ మధ్య మూడో వన్డేతో రిఫరీ క్రిస్ బ్రాడ్ అరుదైన రికార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్ రిఫరీ అయిన బ్రాడ్... 300 వన్డేలకు రిఫరీగా వ్యవహరించిన రెండో వ్యక్తిగా నిలిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రిస్ బ్రాడ్‌కు భారత కెప్టెన్ కోహ్లి జ్ఞాపిక అందజేశాడు.
ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ బ్రాడ్ 2004లో ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌కు తొలిసారి రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన కంటే ముందు రంజన్ మధుగలె (శ్రీలంక–336 మ్యాచ్‌లు) అత్యధిక మ్యాచ్‌లకు రిఫరీగా ఉన్నారు.