ఢిల్లీలో బీసీసీఐ సొంత స్టేడియం! | BCCI's own stadium in Delhi! | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో బీసీసీఐ సొంత స్టేడియం!

Jun 29 2016 11:53 PM | Updated on Sep 4 2017 3:43 AM

దేశ రాజధాని న్యూఢిల్లీలో సొంతంగా ఓ కొత్త స్టేడియాన్ని నిర్మించుకోవాలని బీసీసీఐ ఆలోచన చేస్తోంది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో సొంతంగా ఓ కొత్త స్టేడియాన్ని నిర్మించుకోవాలని బీసీసీఐ ఆలోచన చేస్తోంది. రకరకాల కారణాలతో ప్రతిసారీ ప్రధాన మ్యాచ్‌ల వేదికలు మారుస్తుండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. అలాగే ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘంతో కూడా ఏదో సమస్య వస్తుండటం కూడా బోర్డును ఆలోచనలో పడేసింది.


దీంతో ఇటీవల జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. సొంతంగా స్టేడియం ఉంటే ఐపీఎల్, వరల్డ్‌కప్ ఫైనల్స్, భారత్, పాక్ మ్యాచ్‌లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేశ రాజధానిలో ఆతిథ్యమివొచ్చని బోర్డు అభిప్రాయపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement