వరుసగా మూడో సారి... | Australia Women in third successive final | Sakshi
Sakshi News home page

వరుసగా మూడో సారి...

Apr 4 2014 1:16 AM | Updated on Sep 2 2017 5:32 AM

వరుసగా మూడో సారి...

వరుసగా మూడో సారి...

డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా మూడోసారి మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. గత రెండు టోర్నీల్లోనూ ఆస్ట్రేలియానే టైటిల్ గెలిచింది.

టి20 మహిళల ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా  
 సెమీస్‌లో వెస్టిండీస్‌పై విజయం
 
 ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా మూడోసారి మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. గత రెండు టోర్నీల్లోనూ ఆస్ట్రేలియానే టైటిల్ గెలిచింది. షేరే బంగ్లా స్టేడియంలో గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 8 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 140 పరుగులు చేసింది. విలాని (35), లానింగ్ (29) రాణించారు. అలిసా హీలీ (21 బంతుల్లో 30 నాటౌట్;4 ఫోర్లు) మెరుపులతో ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోరు లభించింది. వెస్టిండీస్ మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. డాటిన్ (40), స్టాసీ (36 నాటౌట్) చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement