రీల్స్​పై మోతమోగుతున్న మీమ్స్!

netizens creating memes buzz with reels - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టిక్​టాక్​పై నిషేధం పడిన కొద్దిరోజులకే దాన్ని పోలిన కొత్త యాప్​ను ఇండియన్స్​ కనిపెట్టేశారు. ఫేస్​బుక్​ తీసుకొచ్చిన ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​లో చెలరేగిపోతున్నారు. పోస్టులు, కామెంట్లు, మీమ్స్​తో సదరు ప్లాట్​ ఫాంను హోరెత్తిస్తున్నారు. పనిలో పనిగా టిక్​టాక్​కు ప్రత్యామ్నాయం దొరికిందని సంబరపడుతూ ట్విటర్​లో మీమ్స్​తో కుమ్మేస్తున్నారు. (కోవిడ్‌ 19 : ఎంఐటీ సర్వేలో షాకింగ్ వివరాలు)

రీల్స్​లో 15 సెకన్లు కలిగిన వీడియోలను యూజర్లు పోస్టు చేయొచ్చు. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్​లో ప్రస్తుతం రీల్స్​ను ఫేస్​బుక్​ పరీక్షిస్తోంది. (20 కోట్లకు పైగా జనాభా.. మరణాలు 845!)

రీల్స్​ ద్వారా వ్యక్తుల వాయిస్​ కూడా వీడియోకు జోడించొచ్చని వైస్​ ప్రెసిడెంట్ విశాల్​ షా వెల్లడించారు. టిక్​టాక్​ బ్యాన్ తర్వాత ఇన్​స్టాగ్రామ్​లో చేసిన పోస్టుల్లో 45 శాతం వీడియోలేనని తెలిపారు. రీల్స్​లో మ్యూజిక్ ట్రాక్స్​, ఫిల్టర్స్​, ఎడిటింగ్ టూల్స్​తో పాటు స్పార్క్ ఏఆర్​ ఎఫెక్ట్స్​ కూడా వాడొచ్చు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top