వైరల్‌ వీడియో: బుడ్డోడి స్టెప్పులు అదుర్స్‌ | IPS Officer Shares Child Dance Viral Video | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: బుడ్డోడి స్టెప్పులు అదుర్స్‌

Nov 14 2019 6:39 PM | Updated on Nov 14 2019 8:07 PM

IPS Officer Shares Child Dance Viral Video - Sakshi

టాలెంట్‌​ ఉండాలే గానీ గుర్తింపు దానతంటే అదే వస్తుంది. విస్తరిస్తున్న టెక్నాలజీకి తోడు.. సోషల్‌ మీడియా ప్రపంచాన్ని ఏలేస్తోంది. బాహ్య ప్రపంచంలో ఏ మూలన్న ఉన్నా.. ఇలా పట్టి ఖండాలను దాటిస్తుంది. తాజాగా నైజీరియన్‌కు చెందిన ఓ బుడ్డోడు చేస్తున్న డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భూమికి నాలుగడుగులు కూడా లేని పిల్లవాడు.. డ్యాన్స్‌ ఇరగదీస్తున్నాడు. నైజీరియన్‌ మట్టి నేలపై అతను వేసే స్టెప్పులు బ్రేక్‌ డ్యాన్సర్లను సైతం ఔరా అనిపిస్తున్నాయి. ఐపీఎస్‌ అధికారి రెమా రాజేశ్వరి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కొద్ది సమయంలో ఇది వైరల్‌గా మారింది. బుడ్డోడి డ్యాన్స్‌కి ఫిదా అయిన నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని స్టెప్పులను పలువురు ఛాలెంజ్‌గా స్వీకరిస్తున్నారు. కిరాక్‌ డాన్స్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అయితే అతనికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement