బొత్సపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. వైఎస్‌ఆర్‌సీపీ నేతల ఫైర్‌! | ysr congress leaders fire on minister sujaykrishna rangarao | Sakshi
Sakshi News home page

బొత్సపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. వైఎస్‌ఆర్‌సీపీ నేతల ఫైర్‌!

Oct 29 2017 3:56 PM | Updated on Jul 12 2019 3:10 PM

ysr congress leaders fire on minister sujaykrishna rangarao - Sakshi

సాక్షి, విజయనగరం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణపై మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి సుజయ్‌కృష్ణపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతుల డబ్బులు తీసుకొని.. చైన్నైకి పారిపోయిన చరిత్ర ఆయనదని పార్టీ నేత బెల్లాన చంద్రశేఖర్‌ మండిపడ్డారు. తోటపల్లి ప్రాజెక్టుపై ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు.

మంత్రి పదవి కోసం పార్టీ మారిన వ్యక్తి సుజయ్‌ అని, ఇప్పడు బ్రోకర్‌ ఎవరో ఆయనే చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టబోతున్న పాదయాత్ర టీడీపీ నేతల్లో గుబులు రేపుతోందని మాజీ ఎమ్మెల్యే అప్పలనర్సయ్య విమర్శించారు. బొత్సను విమర్శించే అర్హత మంత్రి సుజయ్‌కృష్ణకు లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement