విదేశీ టూర్లతో ఉద్యోగాలొస్తాయా? | Sakshi
Sakshi News home page

విదేశీ టూర్లతో ఉద్యోగాలొస్తాయా?

Published Thu, Jan 25 2018 1:33 AM

YS Jaganmohan Reddy fires on Cm chandrababu - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘విదేశాలు పట్టుకు తిరిగితే ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాల పేరు చెప్పి నాలుగేళ్లలో 22 సార్లు విదేశాలకు వెళ్లొచ్చి సాధించిందేమిటి? ఓ వైపు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూ.. మరోవైపు రూ.200 కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు విమానాలలో పర్యటనల కోసం ఖర్చు చేస్తావా?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 70వ రోజు బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు.  జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

పక్కనే స్వర్ణముఖి.. అయినా తాగునీరు లేదు..
సూళ్లూరుపేట నియోజకవర్గంలో రెండో రోజూ ప్రజలు ఆదరాభిమానాలు, ప్రేమాప్యాయతలు చూపిస్తూనే వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా తాగడానికి నీళ్లు లేవన్నా.. అని నేను పర్యటించిన ప్రతి ఊళ్లో చెప్పారు. స్వర్ణముఖి నది పక్కనే ఉన్నా తమకీ దుస్థితి ఏమిటని అడిగారు. చంద్రబాబు నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు తాగడానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. వాస్తవానికి నెల్లూరు జిల్లా వరికి పెట్టింది పేరు. రబీలో ఇక్కడ వేసే వరి పంట తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో కూడా వేయరు.  కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే గత ఖరీఫ్‌లో లక్ష హెక్టార్లలో వరి వేయాల్సి ఉంటే 39 వేల హెక్టార్లలో మాత్రమే సాగయింది. పక్కనే సోమశిల ఉంది. కానీ మన ఖర్మ ఏమిటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.

కాస్తో కూస్తో ఆ దేవుడు కరుణించి వర్షాలు కురవడంతో రబీ పంటయినా బతికింది. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో.. ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి ఉండకూడదన్న ఉద్దేశంతో ఆనాడు నాన్నగారు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 44 వేల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో పనులకు పూనుకున్నారు. ఆ హెడ్‌ రెగ్యులేటర్, ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ పూర్తయితే సోమశిలకు నీటి కొరత ఉండేది కాదు. ఆ దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు మిగిలిన 20 శాతం పనులను పూర్తి చేయలేదు. ఇదే కాదు.. సోమశిల–స్వర్ణముఖి ప్రాజెక్టు గుర్తుందా? ఇప్పటికీ కెనాల్స్‌ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఆ ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌కు నాన్నగారి హయాంలో రూ.400 కోట్లకు గాను రూ.180 కోట్లు ఖర్చు చేసి 60 శాతం పనులు పూర్తి చేయిస్తే ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ఆ మిగిలిన 40 శాతం పనుల్ని పూర్తి చేయలేకపోయారు. అదేగనుక పూర్తయి ఉంటే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 316 చెరువులకు నీళ్లు వచ్చి ఉండేవి. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేది. కానీ ఈ పెద్దమనిషి చంద్రబాబుకు రైతులు పట్టరు.  

పులికాట్‌ను గాలికొదిలేశారు
దేశంలోని ఉప్పునీటి సరస్సుల్లో రెండవ పెద్దదైన పులికాట్‌ ఈ జిల్లాలో ఉంది. 30 వేల మంది మత్స్యకారులు దీనిపై ఆధారపడి బతుకుతారు. కానీ ఈ వేళ ఆ సరస్సుకున్న రెండు ముఖ ద్వారాలు ఇసుక మేటలతో మూసుకుపోయాయి. ఫలితంగా చేపలు సరిగా దొరకని పరిస్థితి. ఇసుక మేటల్ని తొలగిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్కసారి అయినా ఈ విషయమై ఆలోచన చేశారా?  ఆయనకు పులికాట్‌ పట్టదు.. రైతులు, మత్స్యకారుల సమస్యలు పట్టవు. వాళ్లు ఎట్లా పోయినా పర్వాలేదు ఆయనకు. కానీ వీళ్లు మళ్లీ ఎప్పుడు గుర్తుకువస్తారో తెలుసా? ఎన్నికలప్పుడు మాత్రమే. ప్రజల్ని ఎలా మోసం చేయాలన్నది మాత్రమే ఆయనకు గుర్తుకు వస్తుంది. జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, దుగరాజపట్నం పోర్టులనే చూడండి. టెంకాయలు కొట్టాడు, మరిచి పోయాడు. 

రూ.200 కోట్ల ప్రజాధనం బూడిద పాలు
ఉద్యోగాల కోసమంటూ చంద్రబాబు దేశదేశా లు పోతాడు. ఇపుడు దావోస్‌ వెళ్లాడు. ఈ నాలుగేళ్లలో ఈ పెద్దమనిషి 22 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. విదేశాలకు ప్రైవేట్‌ విమా నాల్లో పోతాడు. మన ఉద్యోగాల పేరిట ఆయ న గారి ఈ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల రూ.200 కోట్లు. మన పేరు చెప్పి ఇంత ప్రజాధనాన్ని బూడి దలో పోసిన పన్నీరు మాదిరి చేశారు. కబుర్లు చెప్పే చంద్రబాబు మన రాష్ట్రానికి ఒక్కటైనా శాశ్వత కట్టడాన్ని కట్టలేకపోయారు. ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఒక సచివాలయానికైనా పర్మినెంట్‌గా ఒక్క ఇటుకనైనా వేయలేదు. ఎంత అధ్వానపు సీఎం అయినా ఈ నాలుగేళ్ల లో కళ్లు మూసుకుని హైకోర్టు, అసెంబ్లీ, సచి వాలయాన్ని కట్టేవారు. బాబు మాత్రం కంప్యూటర్లలో డిజిటల్‌ ప్రజంటేషన్లు చూపిస్తా డు. అంతా షోనే. ఆ షో కు రాజమౌళి అని సినిమా డైరెక్టర్‌ను పిలుస్తాడు. నాకు అర్థం కాక అడుగుతా.. అసలు సినిమా డైరెక్టర్లేందీ, అసెంబ్లీ బిల్డింగ్, సచివాలయం, హైకోర్టు ఏందీ? ఆర్కిటెక్ట్‌ చేయాల్సిన పని ఆర్కిటెక్ట్‌ చేయాలి.. సినిమా వాళ్లు సినిమా పని చేయా లి. కానీ బాబు మాత్రం మనకు షో చూపిస్తా డు. (జనం నుంచి అరుపులు, కేకలు) పెద్ద సినిమా చూపిస్తాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement