టీడీపీ దాడులపై వైఎస్సార్‌ సీపీ నిర్థారణ కమిటీ

YS Jagan Formed Facts Finding Committee On TDP Attacks - Sakshi

టీడీపీ దాడులు, దౌర్జన్యాలపై నిజ నిర్థారణ కమిటీ వేసిన వైఎస్సార్ సీపీ 

సాక్షి, హైదరాబాద్‌ : గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్‌ (ఏప్రిల్‌ 11) రోజున, పోలింగ్‌ తర్వాత టీడీపీ శ్రేణులు పాల్పడిన దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిజనిర్ధారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యులు పై మూడు నియోజక వర్గాలలో పర్యటించి.. ఆయా గ్రామాల్లో   కోడెల శివప్రసాద్, ఆయన అనుచరులు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులపై వాస్తవాలు తెలుసుకోవడంతోపాటు, ఈ దాడుల్లో గాయపడిన, నష్టపోయిన వారికి పార్టీ అండగా నిలుస్తోందని భరోసా ఇస్తారు.

టీడీపీ దౌర్జన్యకాండకు సంబంధించి ఈ కమిటీ బాధితులను నేరుగా కలిసి వాస్తవాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత సమగ్ర నివేదికను జగన్‌ మోహన్‌ రెడ్డికి సమర్పిస్తారు. మర్రి రాజశేఖర్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో సభ్యులుగా లావు శ్రీకృష్ణదేవరాయలు, అంబటి రాంబాబు,  కాసు మహేశ్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జంగా కష్ణమూర్తి, మహమ్మద్‌ ఇక్బాల్‌ ,అంజాద్‌ బాషా, నవాజ్‌ సభ్యులుగా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

చదవండి....(మేరుగ నాగార్జునపై దాడి.. బయటకు వచ్చిన వీడియో)
టీడీపీ బరితెగింపు
కోడెలపై దాడి చేశారని....

తెలుగుదేశం పార్టీ దౌర్జన్యకాండకు సంబంధించి ఈ కమిటీ బాధితులను నేరుగా కలిసి వాస్తవాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత సమగ్ర నివేదికను పార్టీ అధ్యక్షుడికి సమర్పిస్తుంది. ఈ కమిటీకి మర్రి రాజశేఖర్‌ నేతృత్వం వహించనుండగా.. కమిటీలో శ్రీ కష్ణదేవరాయలు, అంబటి రాంబాబు, కాసు మహేశ్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మహమ్మద్‌ ఇక్బాల్, ముస్తఫా, అంజాద్‌ భాషా, నవాజ్‌ సభ్యులుగా ఉన్నారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఇవాళ రాత్రి ఏడు గంటలకు గుంటూరు ఎస్పీని కలిసి టీడీపీ వర్గీయుల దాడులపై ఫిర్యాదు చేయనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top